: సెప్టెంబరు 1 అంటే సేమ్యా పరమాన్నము ! ( రెండవ భాగము) 2014 !

 

సెప్టెంబరు 1 అంటే సేమ్యా పరమాన్నము !!
( రెండవ భాగము)

సెప్టెంబరు 1 - సేమ్యా పరమాన్నము అన్న మాటకి విశేషము మా నాన్నగారి పుట్టినరోజు ( మావిజయ పుట్టినరోజు) సేప్టెంబరు ఒకటి అవడమే .

చిననాటి అనుభూతులు ఎప్పుడూ అందరికీ మథురమే - అది రాయడము అయింది !

ఆ సందర్భములో మా నాన్నగారి దగ్గర వుండే పుస్తకములు చూడడము అయింది.
అందులో ఒకటి -
" ఇన్ ద వుడ్స్ అఫ్ గాడ్ రియలైజేషన్ " ( In the woods of God realization !)

అవి స్వామీ రామతీర్థ గారి ఉపన్యాసాల పుస్తకము.
అవి ఎప్పటి ఉపన్యాసాలు అంటే .. విని కోంచెము ఆశ్చర్యపోతాము.
అవి 1902-06 లో అమెరికా పశ్చిమ తీరములోని San Francisco , Academy of Sciences Hall లో ఇచ్చిన ఉపన్యాసాలు.

అంటే స్వామీ వివేకానంద గారి చికాగో ఉపన్యాసల( 1893) తరువాత అన్నమాట. స్వామీ వివేకానంద ముఖ్యముగా చికాగో , న్యూయార్క్ ప్రాంతాలలో ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయన ద్వారా హిందూ వేదాంతము గురించి intellectual level లో చాలామందికి తెలిసింది.

స్వామీ రామతీర్థ San Francisco ఉపన్యాసాలకి స్వామి వివేకానంద ఉపన్యాసాలు నాంది పలికాయన్నమాట !

ఆ పుస్తకము ( ఆ ఉపన్యాసాలు అన్నమాట) చదువుతూ ఉంటే మన హిందు వేదాంతము ఇంత సులభముగా ఏట్లా చెప్పగలిగారు అని ఆశ్చర్యము రావక తప్పదు.

ఇంతకీ ఈ పుస్తకానికి మా నాన్నగారికి సంబంధము ఏమిటి అని అనిపించవచ్చు !
అదే మా ఇంకోమాట !

ఆ పుస్తకములో అక్కడక్కడ టిక్కు మార్కులు అక్కడక్కడ " ఇమ్పార్టెంట్ " అని రాసి వున్నాయి. ఫుస్తకము లో చాలాచోట్ల వాక్యాల క్రింద పెన్చిల్ తో అండర్ లైను చేయబడడము కనిపిస్తాయి.

అందులోంచి కొన్ని వాక్యాలు :


" It is the denial of one's little self i.e. Ahankara even for a while in the heat of work or in the ecstacy of love .. is .. Vedanta in Practice "

" The shedding of our individuality or "I" for the time being is the secret of practical Vedanta"

" Judge not through the opinion of others . Be not hypnotized by the opinon of others. More a man stands above this weakness of being hypntized by others, the more free he is !!

ఒక పుస్తకములో చిన్న బుక్ మార్కు లాగా ఒకచోట కాగితము పెట్టి వుంది - ఆ చిన్న కాగితము 1974 newspaper తునక - అక్కడ రాసిన కథనము ఇది :

" what happens in our house holds ? Husband and wife have to help each other in working out his or her salvation, in acquiring the the perfect , the real knowledge or the Atman"

" Wife and Husband alike should do all in their power to add to the benifit of eachother. Demand nothing . expect nothing then everything will come to you . You will be filled with heaven"

" if you expect nothing and give, you will find happiness in giving. Happiness lies in the object in which it is represented. Do not represent your happiness in receiving, but in giving ; giving always gives happiness."

ఇవి చదివిన తర్వాత తెలిసింది :

నాన్నగారి పచ్చయప్ప కాలేజి డిగ్రీ తో నాన్నగారికి వేదాంతము చదవడము మీద ఆశక్తి ఉండేది అని.
ఆ పుస్తకములో రాశిన చిటికలు బట్టీ నాన్నగారికి వేదాంతంలో చాలా అవగాహన ఉండేది అని.
అమ్మ వేదాంతం నాన్నగారి వేదాంతం ఒకే మెట్టులో సాగాయని
వాళ్ళు ఈ వేదాంత ధోరణిలో మాట్లాడుకుంటూ ఒక స్థాయి చేరారు అని
పిల్లలకి వారి వేదాంత భాషణలో అవగాహన లేదని వాళ్ళకి తెలిసి వాళ్ళలో వాళ్ళే వాళ్ళ ఆత్మకి సంపూర్ణత కలిగించుకున్నారని
వాళ్ళలో వాళ్ళే వేదాంత పరిభాషలో మాట్లాడుకొని సంతృప్తి చెందారని అనిపిస్తుంది .

అమ్మ ఎప్పుడూ వేదాంతమో ఏదో రాస్తూనే ఉండేది అది అందరికీ తెలుసు ;
నాన్నగారు ఏమి చేస్తూ ఉండేవారు?
నాన్నగారికి సీరియస్ గా వేదాంతంలో రుచి ఉండేదా ,
లేక పోస్టాఫీసు ధోరణిలో లౌకికముగా లౌకిక కష్టనిష్టూరాలలో మునిగి తేలే వారా ?
అన్న ప్రశ్నలకు సమాధానము ఇప్పుడు నాకు తెలుసు>

నాన్నగారి వేదాంత ధోరణి వారి మిత భాషణలో వుంది
నాన్నగారి వేదాంతం వారి నెమ్మదితనంలో వున్నది
స్థితధీః మునిరుచ్యతే అన్న మాటకు నాన్నగారు ఒక ఉదాహరణ .

వాళ్ళు పిల్లల కోసము పడిన కష్టాలు చాలావున్నాయి
కాని వాళ్ళిద్దరి సమానమైన దృక్పథమే వాళ్ళని భవసాగరాన్ని దాటించాయి !!

అందుకే ఆ సెప్టెంబరు ఒకటి సేమ్యాపరమాన్నము చాలా రుచి !

||ఓమ్ తత్ సత్||